Tue Apr 07 2026 10:06:07 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు నేడు వచ్చే వారికి గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామి వారి దర్శనం సులువుగానే భక్తులకు లభిస్తుంది. నేడు మంగళవారం కావడంతో భక్తులు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. పెద్దగా కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే స్వామి వారి దర్శనం చేసుకుంటున్నట్లు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు భక్తుల సంఖ్య తగ్గినా శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
రోజుకు ఎనభై వేల మందికి...
శుక్రవారం నుంచి మొదలయిన రద్దీ సోమవారం వరకూ తిరుమలలో కొనసాగింది. ప్రతి రోజూ ఎనభై వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం కూడా నాలుగు కోట్ల రూపాయలు రోజుకు లభిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మధ్యాహ్నానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశముందన్న అంచనాలున్నాయి.
ఏడు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం ఆరు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్వనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,294 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,796 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.75 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

