Fri Oct 04 2024 06:35:53 GMT+0000 (Coordinated Universal Time)
NOVEMBER 10 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ప్రతి విషయంలో కీడెంచి మేలెంచాలన్న చందంగా ఆలోచిస్తారు. నిదానమే ప్రధానంగా..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, గురువారం
తిథి : బ.విదియ సా.6.32 వరకు
నక్షత్రం : రోహిణి తె.5.08 వరకు
వర్జ్యం : రా.8.28 నుండి 10.12 వరకు
దుర్ముహూర్తం : ఉ.9.58 నుండి 10.43 వరకు, మ.2.29 నుంి 3.15 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.4.00 నుండి 5.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో సానుకూలంగా ఉంటుంది. సహ ఉద్యోగుల సహాయ, సహకారాలుంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అప్పులు వసూలయ్యే అవకాశాలున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. జరుగుతాయనుకున్న పనులు ఆగిపోతాయి. అన్నిరంగాల్లో ఉన్నవారు ఎవరినీ నమ్మకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహం వస్తుంది. చర్చలు ఫలిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. క్రయవిక్రయాలకు సానుకూలంగా ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా చిన్నచిన్న ఒడిదుడుకులుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక విషయాలపై దృష్టిసారిస్తారు. పెద్దలు అర్థం చేసుకోవడం లేదని మనస్తాపం చెందుతారు. పనులు నిదానంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ప్రతి విషయంలో కీడెంచి మేలెంచాలన్న చందంగా ఆలోచిస్తారు. నిదానమే ప్రధానంగా ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నమ్మకద్రోహం జరిగే సూచనలున్నాయి. అప్పులు చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు విభిన్నంగా ఆలోచిస్తారు. కొత్తగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పార్ట్ టైమ్ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు ఉపకరిస్తాయి. కొనుగోళ్లపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అప్పులు తీరుతాయి. అంచనాలు కొనసాగుతాయి. విద్యార్థినీ, విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంట్లో చిన్న సమస్యలు, కొట్లాటలు జరిగే అవకాశాలున్నాయి. మిగతా అన్ని విషయాల్లోనూ పెద్ద సమస్యలేవీ ఉండవు. అన్నింటా సానుకూల పరిస్థితులుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ముఖ్యంగా ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మందగిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంది. పెండింగ్ లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. దంపతుల మధ్య గొడవలు పరిష్కారమవ్వొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
Next Story