Fri Oct 04 2024 05:43:53 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 17 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలు ఫలిస్తాయి. మధ్యవర్తిత్వ మాటసహాయం కలిసివస్తుంది.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, శనివారం
తిథి : బ.నవమి తె.3.41 వరకు
నక్షత్రం : ఉత్తర ఉ.9.18 వరకు
వర్జ్యం : సా.6.03 నుండి 7.43 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.33 నుండి 7.01 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.45 నుండి 11.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బ్యాంక్ లోన్లు సానుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో సాధారణ ఫలితాలుంటాయి. ఎదుటివారిని అంచనా వేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శత్రుబాధల నుండి బయటపడతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకోవడం మంచిది. అనవసరమైన వివాదాలు తలకు చుట్టుకుంటాయి. అంచనాలు తారుమారవుతాయి. ప్రేమలు వివాదాస్పద మవుతాయి. ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం సంశయాత్మకంగా ఉంటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. సంతకానికి విలువైన ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలు ఫలిస్తాయి. మధ్యవర్తిత్వ మాటసహాయం కలిసివస్తుంది. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఉత్సాహంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో వెసులుబాటు ఉంటుంది. అన్ని అనుకూలతలున్నా.. ఏదో తెలియని ఆందోళన వెంటాడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. శారీరక, మానసిక శ్రమ పెరుగుతాయి. వృథా ఖర్చులు చేస్తారు. పాత పరిచయస్తులను కలుస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగంలో వారికి అనుకూల ఫలితాలుంటాయి. ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలుంటాయి. ఉపాధ్యాయ వృత్తిలోవారికి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఎదుటివారిని అర్థంచేసుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఒకే సమయంలో అన్ని పనులు చేయాల్సి ఉండటంతో.. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభకార్యాలు సానుకూలంగా సాగుతాయి. ఇంటర్వ్యూలు వంటి వాటిలో సక్సెస్ అవుతారు. నిదానంగా ఆలోచించి.. మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story