Fri Mar 06 2026 10:18:02 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్.. ఈరోజు దర్శనం ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రెండు రోజుల వరకూ తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది.చంద్ర గ్రహణం కారణంగా, ఆ మరుసటి రోజు కూడా తిరుమలకు పెద్దగా భక్తులు రాలేదు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా 1.30 కోట్ల రూపాయలుకు పడిపోయింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనాలకు తగినట్లుగానే శుక్రవారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందని భావించారు.వారి అంచనాలు నిజమయ్యాయి.
కంపార్ట్ మెంట్లన్నీ కళకళ...
ఈరోజు కంపార్ట్ మెంట్లన్నీ భక్తుల తో కళకళలాడుతున్నాయి. శుక్రవారం మొదలయి శనివారం, ఆదివారం వరకూ భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా మరింతగా భక్తుల రద్దీ కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కాలంలో ఎండలు తీవ్రతరం కావడంతో భక్తుల రద్దీ తగ్గుతుందని అనుకున్నప్పటికీ శుక్రవారం రద్దీ చూసిన తర్వాత వేసవి రద్దీ ఇప్పటి నుంచే మొదలయిందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరో్జు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది హేను నుంచి ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 59,194 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,295 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

