Wed Mar 18 2026 10:18:33 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కంపార్ట్ మెంట్లు, క్యూ లైన్ లలో ఉన్న భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
రోజురోజుకూ...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగా పెరుగుతుంది. కాలి నడకన వచ్చే భక్తులతో పాటు ప్రత్యేక దర్శనం టోకెన్లు ముందుగానే బుక్ చేసుకునే వారితో పాటు, అప్పటికప్పుడు తిరుమలకు వచ్చి ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకునే వారితో రద్దీ ఎక్కువయింది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా జరుగుతుండటంతో కొత్తగా పెళ్లయిన నవ దంపతులు కూడా తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
22 కంపార్ట్ మెంట్లలో...
తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మంగళవారం స్వామి వారిని 70,002 మంది భక్తులు దర్శించుకున్నారు.21,738 భక్తులు తమ తలనీలాలు స్వామి వారికి సమర్పించారు.ఇక శ్రీవారి హుండీ కానుకలు 4. 88 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
Next Story

