Sat Mar 07 2026 10:37:04 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు వెళ్లే వారు నేడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న ప్రారంభమయిన రద్దీ నేడు కూడా కొనసాగుతుందని, రేపు కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవి కాలం మొదలు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుందని అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగానే వారికి అవసరమైన సౌకర్యాల కల్పన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తుల సంఖ్య రానున్నకాలంలో...
తిరుమలకు వచ్చే భక్తులు సంఖ్య మరింతగా పెరుగుతుంది. రాను రాను తిరుమలకు రోజుకు అరవై వేల నుంచి ఎనభై వేల మందికి పైగానే భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలకు వచ్చేభక్తులు గతంలో ఒక సీజన్ లోనో , ఒక వారంలోనో, పండగల సెలవులు, వారాంతపు సెలవుల్లో మాత్రమే వచ్చేవారని కానీ ఇప్పుడు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వచ్చేయడంతో తిరుమల నిత్యం భక్తులతో రద్దీగానే ఉంటుంది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎక్కువగానే వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,855 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,690 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

