Fri Feb 13 2026 20:08:00 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే ఉంది. ఎక్కువ సంఖ్యలో కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏడుకొండల వాడి దర్శనం కోసం గంటల సమయం పడుతుంది. తిరుమలకు వచ్చే భక్తులు ప్రతి రోజు పెరుగుతుండటంతో అందుకు అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్నారు. వసతి గృహాల కొరత లేకుండా చూస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎక్కువగా తిరుమలకు చేరుకుంటున్నారని అధికారులు తెలిపారు.
నిత్యం వివాహాలు...
మరొకవైపు తిరుమలలో పెళ్లిళ్లు నిత్యం జరుగుతాయి. ముహూర్తాలతో సంబంధం లేకుండా తిరుమలలో వివాహాలను జరుపుకుంటారు. కొండ మీద పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖశాంతులతో గడుపుతామన్న నమ్మకంతో ఎక్కువ మంది తిరుమలలో వివాహాలు చేసుకుంటున్నారు. ఈ సంప్రదాయం ఈ నాటిది కాదు. ఎప్పటి నుంచో వస్తుంది. అందుకే వివాహాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. అక్కడ వివాహం చేసుకుని స్వామి వారిని పసుపు బట్టలతో దర్శించుకోవడం సంప్రదాయంగా మారింది.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 61,632 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,435 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.28 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

