Sun Apr 05 2026 16:11:18 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమల కొండ కిటకిట.. శిలాతోరణం వరకూ క్యూ లైన్
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. గత మూడు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ భారీ సంఖ్యలో ఉంది. కంపార్ట్ మెంట్లు అన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులు బయట క్యూ లైన్ లలో ఉండే వారు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వేడిమికి పాదాలకు ఇబ్బందులు లేకుండా కార్పెట్లను పరిచి వాటిపై నీళ్లు చల్లుతున్నారు.
ఆదాయం ఇలా...
శనివారం శ్రీ స్వామి వారి సన్నిధిలో ఆదాయ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.ప్రత్యేక దర్శనం (50/-) టిక్కెట్లు రూ.1, 86, 43, విశిష్ట దర్శనం (200/-) టిక్కెట్లు రూ.6,974, వేద ఆశీర్వచనం (1,116/-) టిక్కెట్లు రూ. 1,729, తులాభారం టిక్కెట్లు 5, కళ్యాణ కట్ట టిక్కెట్లు 565, లడ్డు మహా ప్రసాదం విక్రయం ద్వారా, లడ్డు ప్రసాదం విక్రయం 55, 716, పులిహోర ప్రసాదం విక్రయిం 22736, నిత్య అన్నదాన కార్యక్రమం నిమిత్తం 1,83,876 రూపాయలు, శాశ్వత అన్నదాన కార్యక్రమం నిమిత్తం రూ.3,25,684, ఇతర విరాళం ద్వారా 15,080, లు శ్రీ స్వామి వారి ప్రత్యేక దర్శనం ద్వారా వచ్చిన రుసుము 9,32,150 లు, శ్రీ స్వామి వారి విశిష్ట దర్శనం ద్వారా వచ్చిన రుసుము 13,94,800 రూపాయలు, మొత్తం రుసుము 76,25,755 లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పద్దెనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,841 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,559 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

