Thu Mar 12 2026 10:29:21 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. గత కొన్ని రోజులుగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా రోజుకు నాలుగు కోట్ల రూపాయల పైనే వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. డిసెంబరు నుంచి నేటి వరకూ హుండీ కానుకలతో కళకళలాడుతుంది. డిసెంబరు 30వ తేదీన ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభమయిన రద్దీ నేటికీ కొనసాగుతుంది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ కూడా...
మరొకవైపు వేసవి కాలం కావడంతో భక్తుల రద్దీ సహజంగానే ఎక్కువగా ఉంటుందని, మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుండటంతో భక్తుల రద్దీ మరో మూడు నుంచి నాలుగు నెలలు కొనసాగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. జులై నెల వరకూ పరీక్ష ఫలితాలు వచ్చి తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే వరకూ తిరుమలలో రద్దీ కొనసాగుతుందని, ఈ నాలుగు నెలల్లో సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,606 మంది భక్తులు దర్శించుకుున్నారు. వీరిలో 25,899 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.78 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

