Tue Feb 10 2026 14:19:04 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు ఇంత రద్దీ పెరగడానికి రీజన్ అదేనా?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సేపు కంపార్ట్ మెంట్లలో భక్తుల వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గత శుక్రవారం మొదలయిన రద్దీ నేడు కూడా కొనసాగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తుల సత్వరం స్వామి దర్శనం కలిగేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటోంది.
వారంతో సంబంధం లేకుండా...
తిరుమలకు నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గత కొంతకాలంగా వారంతో సంబంధం లేకుండా భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. తిరుమలకు వచ్చేభక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపట్టారు. అదనపు గదులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో వసతి గృహాల కొరతను చాలా వరకు తీర్చేందుకు టీటీడీ సిద్ధమయింది. తిరుమలకు నిత్యం అరవై నుంచి ఎనభై వేల మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారని అధికారులు తెలిపారు.
ఇరవై ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ( టోకెన్ లేని భక్తులకు ) పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోగా దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,130 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,631 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం4.03 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

