Tue Mar 03 2026 11:07:07 GMT+0530 (India Standard Time)
తెలుగు రాష్ట్రాల్లో నేడు ఆలయాలు మూసివేత
నేడు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేస్తారు

నేడు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేస్తారు. మధ్యాహ్నం 3:20 గంటల నుంచి చంద్రగ్రహణం ప్రారంభంకానుంది.సాయంత్రం 6:48కి చంద్రగ్రహణం వీడనుంది. చంద్రగ్రహణం కారణంగా నేడు రెండు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు మూసివేయనున్నారు. తిరుమల, కాణిపాకం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, ఇంద్రకీలాద్రి, యాదాద్రి, వేములవాడ ఆలయాలు మూసివేయనున్నారు. ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు.
రేపు సంప్రోక్షణ తర్వాత...
రేపు సంప్రోక్షణ తర్వాత దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని చెబుతున్నారు. కావున భక్తులు ఈరోజు ఆలయాలను దర్శనానికి వెళ్లాలంటే తొమ్మిది గంటల లోపే వెళ్లి దర్శించుకుని వెళ్లాలని, తర్వాత ఆలయ ద్వారాలను మూసివేస్తారని చెప్పారు. చంద్రగ్రహణం కారణంగా అన్ని ఆలయాలను మూసివేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో పెట్టుకుని దేవాలయాలకు రావాలని కోరారు.
Next Story

