Tue Jan 13 2026 04:51:25 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా.. అయితే ఇది వినాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొంత పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొంత పెరిగింది. స్వామి వారి దర్శనానికి కొంత సమయం పడుతుంది. సంక్రాంతి పండగకు సెలవులు ఇచ్చినప్పటికీ సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు కొందరు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు వచ్చే భక్తులు మంగళవారం స్వామి వారిని దర్శించుకుని బుధవారానికి సంక్రాంతి పండగకు తమ సొంతూళ్లకు చేరుకోవడానికి ప్లాన్ చేసుకోవడంతో తిరుమల కొంత భక్తులతో రద్దీ పెరిగింది. తిరుమలకు వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు.
సంక్రాంతి రద్దీతో...
తిరుమలకు ఇటీవల కాలంలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజుల నుంచి కొంత రద్దీ తగ్గింది. సంక్రాంతి వేళ సొంతూళ్లకు ప్రయాణాలు పెట్టుకోవడంతో రైళ్లు, బస్సులు రద్దీ కావడంతో రెండు రోజుల పాటు రద్దీ కొంత తగ్గింది. ఇప్పుడు సంక్రాంతి ఇప్పటికే చేరుకోవడంతో భక్తుల రద్దీ కొంత తిరుమలలో పెరిగినట్లయింది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ కొంత దర్శనానికి సమయం పడుతుండటంతో శ్రీవారి సేవకులు వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, పాలను పంపిణీ చేస్తున్నారు.
పన్నెండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం కోసం ఉదయం క్యూ లైన్ లోకి ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,542 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో es : 22,372 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

