Fri Dec 05 2025 13:29:42 GMT+0000 (Coordinated Universal Time)
Cyber Crime : మీ చేతిలో ఫోన్ తో జాగ్రత్త.. క్షణాల్లో లక్షలు ఆవరవుతాయ్..తస్మాత్ జాగ్రత్త
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ట్రేడింగ్ యాప్ పేరిట మోసాలు చేస్తున్నారు

సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక రూపంలో దూరి అమాయకులను వలలో వేసుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటూ కొంతకాలం మోసం చేశారు. అఅలాగే పెట్టుబడులు అంటూ మరికొంత కాలం మోసం చేశారు. అయితే వాటిపై ప్రభుత్వాలు, పోలీసులు విస్తృతంగా ప్రచారం చేయడంతో ఇప్పుడు మరొక దారిలో మీ ఫోన్ లోకి దూసుకు వస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని నల్లకుంటకు చెందిన ఒక పదవీ విరమణ చేసిన ఉద్యోగికి ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ పేరిటమోసానికి గురయ్యారు. వృద్ధుడిని ఏమార్చి దాదాపు ముప్ఫయి లక్షల రూపాయలు దండుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింద.ి
ఆన్ లైన్ ట్రేడింగ్ అని...
అరవై మూడేళ్ల రిటైర్డ్ ఉద్యోగి నల్లకుంటకు చెందిన వ్యక్తి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ నమ్మి 29.5 లక్షలు కోల్పోయారు. ఈ మోసంపై సైబర్‌క్రైమ్ పోలీసుకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం ప్రకారం, నవంబర్‌లో ‘దివ్యా మెహ్రా’గా గుర్తించిన ఓ మహిళ ఫోన్ ద్వారా బాధితుడిని వాట్సాప్ గ్రూప్‌లో చేర్చింది. ఆమె షేర్లు, ఓటీసీ ట్రేడ్లు, ఐపీఓల్లో పెట్టుబడి పెట్టొచ్చని చెప్పి నకిలీ యాప్‌ను ఇన్స్టాల్ చేయించింది. ఆ క్రమంలో ఆయన నుంచి వ్యక్తిగత, ఆర్థిక వివరాలు తీసుకుంది.యాప్‌లో చూపించిన కృతిమ లాభాలను నమ్మి బాధితుడు తనతో పాటు తన భార్య ఖాతా నుంచి పెద్ద మొత్తాలు పంపించాడు.
వాట్సాప్ గ్రూపులో చేర్చి...
మరిన్ని డిపాజిట్లు చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు ఓ కంపెనీ ఐపీఓ కొనాలని కూడా బలవంతం చేశారని సైబర్ క్రైం పోలీసులు చెప్పారు. చివరికి ఆయన తిరస్కరించడంతో స్క్యామర్లు ట్రేడింగ్ ఖాతాను బ్లాక్ చేశారు. ఖాతాలో నకిలీగా 64 లక్షలు చూపిస్తూ, విత్‌డ్రా చేయాలంటే 5 లక్షల పెనాల్టీ చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.మోసం తెలిసిన వెంటనే బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ మోసాలపై ప్రజలు 1930 హెల్ప్‌లైన్ లేదా cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. తెలియని వారు వాట్సాప్ నెంబర్ల ద్వారా, ఫేస్ బుక్ ద్వారా వచ్చి ఇటీవల ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారని తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు హెచ్చరించారు.
Next Story

