online forex scam: హైదరాబాద్ బ్యాంకు ఉద్యోగి ఆన్లైన్ ఫారెక్స్ మోసంలో రూ.41.2 లక్షలు కోల్పోయాడు
టెలిగ్రామ్లో పరిచయం – నకిలీ వెబ్సైట్ ద్వారా మోసం

హైదరాబాద్కు చెందిన 39ఏళ్ల బ్యాంకు ఉద్యోగి బొద్దు సత్యనారాయణ ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో రూ.41.23లక్షలు మోసపోయినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బృందావన్ కాలనీలో నివసించే సతయనారాయణ 2025 జూలైలో టెలిగ్రామ్ యాప్ ద్వారా ముంబయి కొలాబాకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారి మనీషా వర్మగా పరిచయం చేసుకున్న ఒక మహిళను కలిశారు. వీళ్లిద్దరు కొంత కాలం ఆన్లైన్ లో సంభాషిస్తూ వచ్చారు. ఈ క్రమం లో మనీష్ వర్మ తనను ఇష్టపడ్తున్నట్టు చెప్పింది. నెమ్మదిగా తాను ‘డార్వినెక్స్ గ్లోబల్ సిఎస్ లిమిటెడ్’ అనే సంస్థ ద్వారా ఫారెక్స్ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టమని ఒప్పించింది.
సత్యనారాయణ ఇచ్చిన వివరాల ప్రకారం, ట్రేడింగ్ మొత్తాన్ని ఆ మహిళే నిర్వహించిందని, భారీ లాభాలు వస్తున్నాయని తెలిపిందట. “నేను రూ.31.7లక్షలు పెట్టాను. ఆమె రూ.35లక్షలు నా ఖాతాలో వేసినట్లు చెప్పింది. ఇద్దరం కలిపి రూ.2.40కోట్ల లాభం పొందామని చెప్పింది,” అని సత్యనారాయణ పోలీసులకు వివరించారు.
అయితే డబ్బు విత్డ్రా చేయబోగ ఆ వెబ్సైట్ సపోర్ట్ సిబ్బంది ఆదాయపన్ను నిబంధనల ప్రకారం ముందుగా రూ.69లక్షలు ‘ట్యాక్స్’గా చెల్లించాలంటూ డిమాండ్ చేశారని, తాను రూ.10లక్షలు చెల్లించగా, ఆమె రూ.21లక్షలు చెల్లించిందని తెలిపారు.
FCA ధృవీకరించిన నకిలీ వెబ్సైట్
తరువాత ఆ సంస్థ వివరాలను యూకేలోని ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (FCA) ద్వారా పరిశీలించగా, ఆ వెబ్సైట్ నకిలీదిగ తేలిందని చెప్పారు. “ఈ విషయం చెప్పినా ఆమె కంపెనీ నిజమైనదేనని నమ్మించేందుకు ప్రయత్నించింది. మరిన్ని డబ్బులు చెల్లించమని ఒత్తిడి చేసింది,” అని సత్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ మహిళ అసలు చిరునామా, బ్యాంకు వివరాలు ఎక్కడా ఇవ్వలేదని, టెలిగ్రామ్లోనే అన్ని సంభాషణలు జరిగినట్లు తెలిపారు. తన పెట్టుబడిని తిరిగి పొందేందుకు, ఆన్లైన్ సంస్థ, మహిళపై దర్యాప్తు జరిపించాలని కోరారు.
పోలీసులు ఫిర్యాదు స్వీకరించారని, విచారణ కొనసాగుతోందని తెలిపారు.

