Pension Cyber scam: నకిలీ బ్యాంకు అఫ్ బరోడా ప్రకటనతో రిటైర్డ్ Bank of Baroda ఉద్యోగి ఖాతా కి చిల్లు
Mehdipatnamలో 81 ఏళ్ల వ్యక్తి ఫిర్యాదు Bank of Baroda లోగోతో వచ్చిన ప్రకటనే మోసానికి కారణం

Pension Cyber scam: మెహదీపట్నం కు చెందిన 81 ఏళ్ల రిటైర్డ్ Bank of Baroda ఉద్యోగి అకబర్ కృష్ణ తడిమేటి రూ.10.45 లక్షలు కోల్పోయినట్టు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Facebookలో కనిపించిన నకిలీ ప్రకటనను నమ్మి లింక్ నొక్కిన తర్వాతే ఈ మోసం జరిగింది.
అతడు LIC కాలనీ, మేడ్చల్ ప్రాంతంలో ఉంటున్నట్టు ఫిర్యాదులో తెలిపారు. డిసెంబర్ 9న సైబర్ క్రైమ్ వద్ద ఫిర్యాదు ఇచ్చారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ సెవేడి బ్రాంచ్‌లో తన Bank of Baroda సేవింగ్స్ ఖాతా నుంచి అనుమతి లేకుండా మొత్తం రూ.10,45,024.70 డెబిట్ అయినట్టు వివరించారు.
808 పెన్షన్ కార్డ్ పేరుతో మోసం
డిసెంబర్ 6న Facebookలో Bank of Baroda లోగోతో, నటుడు అమితాబ్ బచ్చన్ ఫొటోతో “808 Pension Card” అంటూ అదనపు ప్రయోజనాలు ఇస్తామనే ప్రకటన కనిపించిందని చెప్పారు. లింక్ నొక్కిన వెంటనే “24 గంటల్లో మా టీమ్ సంప్రదిస్తుంది” అని సందేశం వచ్చింది.
అదే రోజు సాయంత్రం “అహ్మదాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి మిశ్రా మాట్లాడుతున్నా” అని చెప్పి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఖాతా వివరాల “వెరిఫికేషన్” పేరుతో వివరాలు అడిగాడని తెలిపారు. కాల్ జరుగుతుండగా మొబైల్ అసహజంగా ప్రవర్తించడంతో హ్యాక్ అయినట్టుగా అనిపించిందని చెప్పారు.
ఆరు ట్రాన్సాక్షన్లలోనే మొత్తం మొత్తాన్ని తీసేశారు
ఫోన్ పెట్టిన కొద్దిసేపటికి రెండు డెబిట్ SMSలు వచ్చాయి. ఆ తర్వాత మొత్తం ఆరు ట్రాన్సాక్షన్లలో రూ.10,45,024.70 డెబిట్ అయినట్టు గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి:
₹2,00,003.54
₹2,00,002.54
₹2,00,008.00
₹2,00,003.54
₹45,003.54
₹2,00,003.54
కాల్ సమయంలో మొబైల్ పనిచేయకపోవడంతో మోసగాడి నంబర్ నమోదు చేసుకోలేకపోయానని ఫిర్యాదులో తెలిపారు.

