Mon Dec 08 2025 08:01:40 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad: సైబర్ మోసగాళ్ల చేతిలో మరో వృద్ధుడు
సైబర్ మోసగాళ్లకు మరో వృద్ధుడు లక్ష రూపాయలను పోగొట్టుకున్నాడు

సైబర్ మోసగాళ్లకు మరో వృద్ధుడు లక్ష రూపాయలను పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందిన 75 ఏళ్ల వ్యక్తి సూపర్‌స్టోర్ పేరుతో వచ్చిన నకిలీ ప్రకటన నమ్మి సైబర్ మోసగాళ్లకు1,09,610 పంపి కోల్పోయాడు. ఫేస్బుక్లో కిరాణా సరుకులు 298 రూపాయలకే ఆఫర్‌గా కనిపించడంతో ఆర్డర్ చేసి తన వివరాలు నమోదు చేశాడు.
తక్కువ ధరలకే...
నవంబర్ 24న సాయంత్రం 4.30 గంటలకు తెలియని వ్యక్తి కాల్ చేసి ఆఫర్ కన్ఫర్మ్ అయిందని చెప్పాడు. వెంటనే వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్ పంపించాడు. ఆ ఫైల్ ఇన్స్టాల్ చేసి 298 చెల్లింపుని పూర్తి చేయడానికి కార్డు వివరాలు నమోదు చేసిన వెంటనే అతని ఫోన్ నియంత్రణ తప్పిపోయింది. వరుసగా ఓటీపీలు కనిపించడంతో ఏదో తప్పు జరిగిందని అతను గుర్తించాడు. వెంటనే తన కుమారునికి సమాచారం ఇచ్చాడు. కుమారుడు క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయించాడు. అప్పటికి మోసగాళ్లు మూడు లావాదేవీల్లో 1,09,610 విత్‌డ్రా చేసినట్లు బ్యాంకులు తెలిపారు అని సైబర్‌క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు చెప్పారు.
Next Story

