Thu Mar 19 2026 11:55:31 GMT+0530 (India Standard Time)
జొమాటో బాయ్.. డ్రగ్స్ డెలివరీ
జొమాటో డెలివరీ బాయ్ గంజాయి చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. సికింద్రాబాద్ పోలీసులు డెలివరీ బాయ్ నితీష్ ను అరెస్ట్ చేశారు

జొమాటో డెలివరీ బాయ్ గంజాయి చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. సికింద్రాబాద్ పోలీసులు డెలివరీ బాయ్ నితీష్ ను అదుపులోకి తీసుకున్నారు. నితీష్ కొంతకాలంగా జొమాటో నుంచి ఆహారపదార్థాలు సరఫరా చేస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఫుడ్ కు బదులు గంజాయిని సరఫరా చేస్తున్నాడు.
నిందితుడు ఇచ్చిన ...
అందిన సమాచారం మేరకు పోలీసులు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న నితీష్ ను పోలీసులు వల వేసి పట్టుకున్నారు. ఇప్పటికే నితీష్ ఇరవై మంది కస్టమర్ల వరకూ గంజాయిని సరఫరా చేశానని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలిసింది. గంజాయిని తీసుకున్న కస్టమర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు.
Next Story

