Thu Sep 12 2024 12:22:23 GMT+0000 (Coordinated Universal Time)
నాల్గవ తరగతి బాలికపై ఆకాయిల అఘాయిత్యం
నగరంలోని అరండల్ పేటలోని మౌలానా అబుల్ కలామ్ అజాద్ ఉర్దూ పాఠశాల ప్రాంగణంలో జరిగిందీ ఘటన. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా..
విజయవాడ : కామాతురాణాం న భయం న లజ్జ.. అంటే కామంతో కళ్ళు మూసుకుపోయినవాడికి భయం వుండదు.. సిగ్గుశరం వుండవు. వయసు బేధంతో సంబంధం ఉండదు. కామకోరిక తీర్చుకోడానికి కంటికి ఎవరు కనిపిస్తే.. వాళ్లని బలిచేయడమే పని. తాజాగా విజయవాడ ఇలాంటి ఘటనే జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు వారంతా. నాల్గవ తరగతి చదువుతున్న బాలికపై కొందరు ఆకతాయిలు అఘాయిత్యానికి యత్నించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన నగరవాసులను కలవరపెడుతోంది.
నగరంలోని అరండల్ పేటలోని మౌలానా అబుల్ కలామ్ అజాద్ ఉర్దూ పాఠశాల ప్రాంగణంలో జరిగిందీ ఘటన. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మందుబాటిళ్లే. పిల్లల్ని పాఠశాలకు పంపాలంటేనే హడలిపోతున్నారు తల్లిదండ్రులు. ఆ స్కూల్ వైపుగా వెళ్తున్న బాలికను కొందరు ఆకతాయిలు పట్టుకుని స్కూల్ గోడ పై నుంచి లోపలికి పడేశారు. సుమారు గంటసేపు ఆ బాలికపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించారు. బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఉడాయించారు. ఇంటికెళ్లిన బాలిక బట్టలు చిరిగి ఉండటంతో.. తల్లిదండ్రులు ఏమైందని అడగడంతో జరిగిన విషయమంతా చెప్పింది.
తల్లిదండ్రులు జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను హింసించిన ఆకతాయిలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Next Story