Sat Sep 14 2024 10:59:02 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి 3 రోజులుగా అత్యాచారం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి పూల వ్యాపారం చేస్తుంటుంది. మూడ్రోజుల క్రితం ఇద్దరు యువకులు ఆమెను బలవంతంగా..
కోదాడ : ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులపాటు అత్యాచారానికి పాల్పడి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకుంది. మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం తెలియడంతో.. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరిపి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకడు స్థానిక కౌన్సిలర్ కుమారుడిగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి పూల వ్యాపారం చేస్తుంటుంది. మూడ్రోజుల క్రితం ఇద్దరు యువకులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమెతో తాగించారు. స్పృహకోల్పోయిన యువతిపై నిందితులు అత్యాచారం చేశారు. మూడ్రోజులుగా చిత్రహింసలకు గురిచేశారు. మూడు రోజుల తర్వాత యువతి ఇంటికి వచ్చింది. ఆమె ఒంటిపై ఉన్న గాయాలు చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఏం జరిగింది అని అడగ్గా యువతి విషయం చెప్పింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి, పోలీసులను ఆశ్రయించారు. కాగా.. కౌన్సిలర్ కొడుకు ఈ కేసులో ఉండటంతో విషయాన్ని సైలెంట్ గా సెటిల్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story