Wed Mar 18 2026 22:08:04 GMT+0530 (India Standard Time)
సెల్ఫోన్ రిపేర్ చేయించలేదని.. యువతి ఆత్మహత్య
సెల్ఫోన్ రిపేర్ చేయించలేదని మనస్తాపంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది.

ఫోన్ రిపేర్ చేయించలేదని మనస్తాపంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అయితే కూతురు సాయిసుమ సెల్ ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది. అయితే తరచూ సెల్ఫోన్ పాడు చేస్తున్నావని తల్లి మందలించింది.
తల్లిదండ్రులు నిరాకరించంతో...
ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పడంతో అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు అంటూ సాయిసుమా మనస్తాపంతో తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

