Tue Sep 10 2024 11:58:38 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగానే భావిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగానే భావిస్తున్నారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఈ యువకుడి మృతదేహం సముద్ర తీరంలో లభించింది. షాద్ నగర్ కు చెందిన అరటి కృష్ణ, ఉషారాణిల కుమారుడు అరవింద్ ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లారు. సిడ్నీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచస్తున్నారు. అరటి కృష్ణ బీజేపీ నేతగా ఉన్నాడు. ఆయన 2006లో మరణించాడు. అయితే అరవింద్ కు ఏడాదిన్నర క్రితమే వివాహమయింది. తల్లి ఉషారాణి తన కుమారుడు అరవింద్ వద్దకు ఆస్ట్రేలియా వెళ్లి గత సోమవారం తిరిగి వచ్చారు.
అనుమానాస్పదంగా...
అయితే అదే రోజున అరవింద్ అదృశ్యమయ్యాడు. దీనిపై అరవింద్ భార్య సిరివెన్నెల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అరవింద్ మృతదేహం సముంద్రంలో పోలీసులు కనుగొన్నారు. అయితే ఇది ప్రమాదమా? లేక మరైదైనా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉషారాణి కోరుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు.
Next Story