Fri Oct 11 2024 08:28:14 GMT+0000 (Coordinated Universal Time)
కారుకొనివ్వలేదని యాసిడ్ తాగి యువకుడి ఆత్మహత్య
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్నకొడుకు..
కోరుట్ల : ఇంట్లో వాళ్లు కారు కొనివ్వకపోవడంతో యువకుడు యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్నకొడుకు భానుప్రకాష్ గౌడ్ కొంతకాలంగా తనకు కారు కొనివ్వాలని కుటుంబ సభ్యులను అడుగుతున్నాడు.
15 రోజులుగా కారు కోసం మరింత పట్టుబట్టి అడగ్గా.. ఇంట్లో ఎవరూ పట్టించుకోలేదు. దాంతో శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామ శివారులో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. యాసిడ్ మంటను భరించలేక బిగ్గరగా కేకలు వేస్తూ రోడ్డుపైకి రాగా.. స్థానికులు గమనించి వెంటనే అతని ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. గతంలో సెల్ఫోన్ కొనివ్వలేదని భాను ప్రకాష్ చేయి కోసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story