Fri Sep 13 2024 14:38:52 GMT+0000 (Coordinated Universal Time)
లవ్ ఫెయిల్యూర్ : యువతి ఇంటి ఎదుట యువకుడి ఆత్మహత్య
ఇటీవల హనుమకొండలో తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువకుడు యువతి పై కత్తితో దాడి చేసిన ఘటన మరువక ముందే..
పెద్దపల్లి : ప్రేమ విఫలమైందని, తాను ప్రేమించిన యువతి లేదా యువకుడు తమ ప్రేమను అంగీకరించలేదని, పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. ఇలా రకరకాల కారణాలచేత నిండు జీవితాలను అర్థంతరంగా ముగించుకుంటోంది నేటి యువత. ఇటీవల హనుమకొండలో తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువకుడు యువతి పై కత్తితో దాడి చేసిన ఘటన మరువక ముందే.. ప్రేమ విఫలమైందన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
ప్రేమ విఫలమైందన్న కారణంతో యువతి ఇంటిముందు ఓ యువకుడు శరరీంపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ప్రేయసి ఇంటిముందుకు యువకుడు పెట్రోల్ తో వెళ్లాడు. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతడిని రక్షించేలోపే నిప్పంటించుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. యువకుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటగా పోలీసులు గుర్తించారు.
Next Story