Mon Sep 09 2024 11:03:46 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. మెకానిక్ షాపులో ముగ్గురి హత్య
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బతుకుదెరువు కోసం వచ్చిన వారు దారుణ హత్యకు గురయ్యారు
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బతుకుదెరువు కోసం వచ్చిన వారు మృత్యు ఒడికి చేరారు. గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు యువకులను అత్యంత దారుణంగా హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే.. డిచ్ పల్లి మండల కేంద్రంలోని నాగపూర్ గేట్ సమీపంలో ఉన్న హార్వెస్టర్ మెకానిక్ షాపులో ముగ్గురు యువకులు పనిచేస్తున్నారు. వీరంతా గత రాత్రి పని పూర్తి చేసుకుని షాపులోనే పడుకున్నారు. నిద్రిస్తున్న ముగ్గురు యువకులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా గొంతులు కోసి హతమార్చారు.
పంజాబ్ రాష్ట్రానికి....
ఉదయం షాపులో రక్తం కనిపించడంతో ఏం జరిగిందో అని స్థానికులు లోపలికి వెళ్లి చూడగా.. ముగ్గురు యువకులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతులు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన ఆధారాలతో కేసు నమోదు చేసి, హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story