Sun Feb 01 2026 21:15:26 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్లో మరో దారుణం.. చెవిటి, మూగ మహిళపై అత్యాచారం
హైదరాబాద్లో మరో దారుణం వెలుగు చూసింది. చెవిటి, మూగ మహిళను బంధించి

హైదరాబాద్లో మరో దారుణం వెలుగు చూసింది. చెవిటి, మూగ మహిళను బంధించి ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకెళితే.. హైదరాబాద్ హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ నగర్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. సాయి అనే యువకుడు చెవిటి, మూగ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళను బాత్ రూంలో బంధించి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను లోపలే ఉంచి గడియ పెట్టి పారిపోయాడు. బాధిత మహిళ భర్త కూడా మూగ వాడే కావడం గమనార్హం. అయితే.. గతంలో అనేక సార్లు అతడిపై ఫిర్యాదు చేశామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హుమయూన్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

