Sat Sep 07 2024 11:09:14 GMT+0000 (Coordinated Universal Time)
బాబాయ్ తో అక్రమ సంబంధం.. భర్తను హత్యచేసిన భార్య
జయరాం భార్యే భర్తను రోకలిబండతో కొట్టి చంపినట్లుగా అంగీకరించింది. భర్త రోజూ తాగి వచ్చి తనను కొట్టడం, వేధిస్తుండటంతో హత్య..
ఖమ్మం : దాంపత్య బంధానికి విలువ ఇవ్వకుండా.. క్షణిక సుఖం కోసం అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. కట్టుకున్న వారిని కాదని.. వివాహేతర సంబంధాలపై మోజు పెంచుకుంటున్నారు. వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హతమార్చిందో భార్య. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరగ్గా.. సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వైరా సీఐ సంపత్ కుమార్ చెప్పిన వివరాల మేరకు.. ఫిబ్రవరి 6న కుర్నవల్లి దళితవాడలో జయరాం (పేరు మార్చబడింది) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
Also Read : ఉమెన్స్ వరల్డ్ కప్ : పాక్ టార్గెట్ 245
జయరాం భార్యే భర్తను రోకలిబండతో కొట్టి చంపినట్లుగా అంగీకరించింది. భర్త రోజూ తాగి వచ్చి తనను కొట్టడం, వేధిస్తుండటంతో హత్య చేసినట్లుగా పోలీసులకు తెలిపింది. ఆమె చెప్పిన విషయాలను బట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు.. విస్తుపోయే నిజాలు తెలిశాయి. జయరాం భార్యకు వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఫిబ్రవరి 26న జయరాం మద్యం సేవించి ఇంటికి వచ్చేసరికి భార్య, ఆమె బాబాయ్ ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూశాడు. కోపంతో భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమె బాబాయ్ జయరాంను తన్నడంతో కిందపడిపోయాడు. ఆ వెంటనే ఆమె పక్కనే ఉన్న రోకలిబండ తీసుకుని భర్త తలపై కొట్టింది. జయరాం స్పృహ తప్పి పడిపోగా.. ఆ తర్వాత భర్త నోటిలో దుప్పటి కుక్కి ఊపిరాడకుండా చేసింది. జయరాం మరణించాడు. విచారణలో ఈ విషయాలన్నీ వెల్లడవ్వగా.. జయరాం భార్య, ఆమె బాబాయ్ ను మధిర కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కు తరలించారు పోలీసులు.
Next Story