Fri Dec 06 2024 17:04:45 GMT+0000 (Coordinated Universal Time)
థానేలో దారుణం.. అపార్ట్ మెంట్ లో మహిళ శరీర భాగాలు
బోరీవాలీలో చిన్న దుకాణం నడుపుతూ మనోజ్ జీవనం సాగిస్తున్నాడు. తాజాగా ఆ ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండటంతో..
ఢిల్లీలో లివ్ ఇన్ పార్ట్ నర్ శ్రద్ధా వాకర్ ను అఫ్తాబ్ పూనావాలా దారుణంగా హతమార్చి, ముక్కలుగా కోసి పోలీసులకు తెలియకుండా ఉండేందుకు వివిధ ప్రాంతాల్లో వాటిని విసిరేసిన ఘటన ఇంకా మరువక ముందే.. అలాంటి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ముంబై నగర పరిధిలో ఉన్న థానేలో ఇలాంటి దారుణమే వెలుగుచూసింది. మీరా రోడ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్న వ్యక్తి తన లివ్ ఇన్ పార్ట్ నర్ ను చంపి, ఆపై ముక్కలుగా నరికిన ఘటన సంచలనం రేపింది.
మనోజ్ సహాని అనే 56 ఏళ్ల వ్యక్తి మూడేళ్లుగా సరస్వతి వైద్య(36) అనే మహిళతో గీతానగర్ ఫేజ్ 7లోని గీతా ఆకాష్ దీప్ భవనంలో 704 ఫ్లాట్ లో సహజీవనం చేస్తున్నాడు. బోరీవాలీలో చిన్న దుకాణం నడుపుతూ మనోజ్ జీవనం సాగిస్తున్నాడు. తాజాగా ఆ ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ అపార్ట్ మెంట్ కు చేరుకుని చూడగా.. మహిళ శరీరంలోని కాళ్లు మాత్రమే కనిపించాయి. మిగతా శరీర భాగాలను కుక్కర్ లో ఉడకబెట్టి పారవేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. కుళ్లిన శరీర భాగాలను బట్టి మహిళ మూడురోజుల క్రితం హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. కుళ్లిపోయిన మహిళ మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మనోజ్ తో పాటు మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Next Story