Sat Sep 07 2024 10:09:49 GMT+0000 (Coordinated Universal Time)
గండిమైసమ్మ వద్ద మహిళపై గ్యాంగ్ రేప్
శుక్రవారం రాత్రి 30 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రెండ్రోజుల..
దుండిగల్ : విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, మచిలీపట్నం.. ఇప్పుడు గండి మైసమ్మ. ఏంటి ఇలా ఊర్ల పేర్లు చెప్తున్నారు అనుకుంటున్నారా ? కాదు.. ఆయా పట్టణాల్లో వారంరోజులుగా ఆడపిల్లలు, మహిళలపై వరుస దారుణాలు జరుగుతున్నాయి. గడిచిన వారం, 10 రోజులుగా తెలుగురాష్ట్రాల్లో క్రైం రేటు విపరీతంగా పెరుగుతోంది. ఎక్కడ చూసినా ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలే కనిపిస్తున్నాయి. తాజాగా.. గండిమైసమ్మ వద్ద మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన వెలుగులోకొచ్చింది.
శుక్రవారం రాత్రి 30 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రెండ్రోజుల క్రితం బాధిత మహిళ షోలాపూర్ నుంచి హైదరాబాద్ కు చేరుకుంది. నిందితులు ఆమెను అర్థరాత్రి సమయంలో బలవంతంగా గండి మైసమ్మలోని ఒక బార్ వెనుకకు తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇమామ్(20) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిందితులు నరసింహ (23), కుద్దూస్ (21), ఉమ్రుద్దీన్ (21) లను అరెస్ట్ చేశారు. వీరంతా ఆటో డ్రైవర్లుగా గుర్తించారు. నలుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story