Fri Dec 05 2025 16:06:55 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో విషాదం.. ఒంటికి నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య
వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా ఉన్న మరుగుదొడ్డి నుంచి భారీగా పొగలు రావడంతో అక్కుడున్నవారు పోలీసులకు..

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తిరుమలలో ఆత్మాహుతికి పాల్పడింది. వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా ఉన్న మరుగుదొడ్డిలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు విజయవాడకు చెందిన సుమతి (53)గా గుర్తించారు. తిరుమలలోని ఓ హోటల్ లో సుమతి పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా ఉన్న మరుగుదొడ్డి నుంచి భారీగా పొగలు రావడంతో అక్కుడున్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది మరుగుదొడ్డి తలుపులను పగులగొట్టి చూడగా.. మహిళ మంటల్లో దహనమవుతా కనిపించింది. వెంటనే మంటలు ఆర్పి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా.. ఫలించలేదు. అప్పటికే మహిళ శరీరం పూర్తి కాలిపోవడంతో ఆమె మరణించింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

