Fri Oct 04 2024 05:32:37 GMT+0000 (Coordinated Universal Time)
నలుగురు పిల్లల్ని చంపి.. తల్లి ఆత్మహత్య
బార్మెర్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. బార్మెర్ జిల్లా దంపతులు .. తమ నలుగురు చిన్నారులతో నివాసం ఉంటున్నారు.
![rajasthan crime news rajasthan crime news](https://www.telugupost.com/h-upload/2023/06/04/1508320-rajasthan.webp)
కన్న మమకారాన్ని చంపుకుని.. నలుగురు పిల్లల్ని చంపి ఆపై తల్లికూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. బార్మెర్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. బార్మెర్ జిల్లా దంపతులు .. తమ నలుగురు చిన్నారులతో నివాసం ఉంటున్నారు. భర్త మైనింగ్ కార్మికుడు. అతను విధులకు వెళ్లిన తర్వాత మహిళ ఓ స్టీల్ డ్రమ్ములో పిల్లల్ని దించి తాళం వేయడంతో వారంతా ఊపిరాడక చనిపోయారు. ఆ తర్వాత మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని డ్రమ్ములో నుంచి చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన చిన్నారుల్లో ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాలుడు ఉన్నట్లు తెలిపారు. గత రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, పిల్లలను ఆమె చంపేందుకు ఇదే కారణం అయి ఉండొచ్చని స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story