Mon Jun 23 2025 02:53:55 GMT+0000 (Coordinated Universal Time)
Murder Sketch : భర్తను హతమార్చేందుకు భార్య స్కెచ్...హనీమూన్ లోనే మరణశాసనం లిఖించి?
భర్తను అతి క్రూరంగా చంపించింది భార్య. హనీమూన్ లోనే హత్యకు స్కెచ్ వేసింది

భర్తను అతి క్రూరంగా చంపించింది భార్య. హనీమూన్ లోనే హత్యకు స్కెచ్ వేసింది. పెళ్లయిన కొద్దిరోజులకే హనీమూన్ కు ప్లాన్ చేసి అనంతరం అక్కడే భర్తను మట్టుబెట్టింది. ఇందుకు కిరాయి హంతకులను హైర్ చేసుకుంది. హనీమూన్ అంటూ గారాలు పోతూ తీసుకెళ్లిన భార్య చివరకు అక్కడే హతమార్చింది. ఇండోర్ కు చెందిన సోనమ్, రఘువంశీలకు గత నెలల్లో పెళ్లి అయింది. అయితే పెళ్లయిన వారం రోజులుకు హనీమూన్ బయలుదేరారు. మేఘాలయకు వెళ్లాలని భార్య సోనమ్ చెప్పడంతో రఘువంశీ కూడా ఓకే చెప్పేశాడు. ఇద్దరూ హనీమూన్ కు వెళ్లి ఎంజాయ్ చేద్దామని భావించిన రఘువంశీ కలల్లో విహరించాడు. తన భార్య తన పాలిట విలన్ అని తెలుసుకోలేకపోయాడు.
మిస్సయిందని తెలిసి...
హనీమూన్ కు వెళ్లిన జంట మిస్సయిందని పోలీసులకు కేసు నమోదయింది. మేఘాలయ పోలీసు బృందాలు కాశీ కొండల్లో గాలింపు కూడా చేపట్టారు. అక్కడున్న వారిని కూడా విచారించారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే రఘవంశీని సోనమ్ ముందుగానే చంపేందుకు ప్లాన్ వేసింది. అందుకు కిరాయి హంతకులను నియమించింది. సుపారీ చెల్లించి వారిని కాశీ కొండలకు పంపింది. కిరాయి హంతకులను రఘువంశీకి గైడ్ లుగా పరిచయం చేసింది. అమాయకంగా నమ్మిన అతనిని నిర్మానుష్య ప్రదేశంలో చంపేసి మృతదేహాన్ని అక్కడ పారేసి వెళ్లిపోయారు. సోనమ్ ఏమీ జరగనట్లుగా ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్లిపోయింది. ఏమీ జరగనట్లు వ్యవహరించింది.
ప్రేమ వ్యవహారమే...
ఈ మిస్సింగ్ కేసును విచారిస్తున్న పోలీసులకు సోనమ్ పై అనుమానం వచ్చింది. ఆమె కాల్ లిస్ట్ ను పరిశీలించారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఉందని తెలిసి సోనమ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు ముగ్గురు కిరాయి హంతకులను ఒప్పందం కుదుర్చుకోవడంతో వారిని కూడా పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు. అయితే పెళ్లయి వారం రోజులు తిరగక ముందే హత్య చేయించింది అంటే అంతకు ముందు వేరే వాళ్లతో ప్రేమ వ్యవహారం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే పెళ్లయిన వారం రోజులకే భర్తను చంపేసి కిరాయి హత్యకులను వినియోగించుకుందని తెలిసింది. సోనమ్ తో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు కిరాయి హంతకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story