Mon Sep 09 2024 12:37:34 GMT+0000 (Coordinated Universal Time)
బాలికతో ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో?
ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో.. ఆమెపై స్నేహితుడితో కలిసి దారుణానికి ఒడిగట్టాడు ప్రియుడు.
ఆడపిల్లలపై అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఉత్తర ప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో.. ఆమెపై స్నేహితుడితో కలిసి దారుణానికి ఒడిగట్టాడు ప్రియుడు. మాయమాటలు చెప్పి, నమ్మించి మత్తుమందు కలిపిన ఆహారం పెట్టి.. ఆఖరికి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనా యూపీలో సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని నాగల్ జిల్లాకు చెందిన బాలిక 10వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో బాలిక కొద్దిరోజులక్రితం ప్రేమలో పడింది.
పెళ్లి ప్రతిపాదనకు ఒప్పుకోకపోవడంతో....
ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడటంతో ఆ యువకుడు ఇటీవల బాలిక వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. యువకుడి పెళ్లి ప్రపోజల్ కు బాలిక ససేమిరా ఒప్పుకోలేదు. తనకు ఇంకా 16 సంవత్సరాలేనని, మైనర్ ను పెళ్లి చేసుకోవడం తప్పని.. మేజర్ అయ్యేంతవరకూ ఆగాలని సూచించింది. బాలిక ఇలానే చెప్తుందని ముందుగానే ఊహించిన ఆ ప్రియుడు తన స్నేహితుడితో కలిసి ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం ముందుగానే మత్తు మందు కలిపి ఉంచిన బర్గర్ ను తినమని ఆమెకు ఇచ్చారు. నమ్మి ఆ బర్గర్ తిన్న బాలిక.. స్పృహ కోల్పోయింది. ఇదే అదనుగా భావించిన ఆమె ప్రియుడు, అతని స్నేహితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బాలిక నగ్న వీడియోలను తీసి ఆమెను బెదింరించసాగారు. వారి వేధింపులను భరించలేని బాలిక పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story