Sat Oct 12 2024 07:22:15 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ పబ్ సీజ్
పంజాగుట్టలోని టాలీవుడ్ పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు
హైదరబాద్ లో పబ్ ల యాజమాన్యాలు నిబంధనలను పూర్తిగా అతిక్రమిస్తున్నాయి. నిర్ణీత వేళలు దాటిన తర్వాత కూడా పబ్ లను తెరచి ఉంచుతున్నాయి. ఈరోజు పంజాగుట్టలోని టాలీవుడ్ పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ పబ్ ను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. పబ్ లో డ్యాన్స్ లతో పాటు సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.
అర్థనగ్న నృత్యాలు...
ఈ సందర్భంగా 9 మంది యువతులను, 34 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ లో అర్థనగ్న డ్యాన్స్ లను చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. తాము నోటీసులు అందజేసినా కేర్ చేయడం లేదని తెలిపారు. గతంలోనూ ఈ పబ్ వివాదాలకు అడ్రస్ గా నిలిచిందని చెప్పారు. పబ్ ను సీజ్ చేశామని తెలిపారు.
Next Story