Mon Mar 16 2026 07:09:48 GMT+0530 (India Standard Time)
వీధి కుక్కల నుండి పారిపోడానికి ప్రయత్నించిన ప్రముఖ వ్యాపారి.. చివరికి
వీధి కుక్కల నుండి తప్పించునే ప్రయత్నంలో ఓ ప్రముఖ వ్యాపారి

వీధి కుక్కల నుండి తప్పించునే ప్రయత్నంలో ఓ ప్రముఖ వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. వాఘ్ బక్రీ టీ గ్రూప్ యజమాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌లో వీధికుక్కల నుండి తప్పించుకునే ప్రయత్నంలో పడిపోవడం వల్ల మెదడు రక్తస్రావం జరిగి మరణించారు. దేశాయ్ వయసు 49 సంవత్సరాలు. పరాగ్ దేశాయ్ అక్టోబరు 15న ఈవెనింగ్ వాక్ కు వెళుతుండగా వీధికుక్కల నుండి తప్పించుకునే ప్రయత్నంలో జారిపడిపోయాడు.
వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించి అక్కడ శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారు. పరాగ్ దేశాయ్ ను కాపాడడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరాగ్ దేశాయ్ చనిపోయారని వాఘ్ బక్రీ టీ గ్రూప్ ప్రకటించింది. పరాగ్ దేశాయ్ కు భార్య కుమార్తె ఉన్నారు.
Next Story

