Fri Dec 05 2025 17:33:42 GMT+0000 (Coordinated Universal Time)
విజయనగరం జిల్లాలో ఊహించని విషాదం
విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో

విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. కొత్తవలస మండలం చింతలపాలెంకు చెందిన భార్యాభర్తలు తమ కుమార్తెతో పాటు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేస్తోంది.
ఎండీ మొహినుద్దీన్ (46) తన కుటుంబంతో కలిసి విశాఖ మర్రిపాలెం పరిధిలోని ఎఫ్సీఐ నగర్లో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం మొహినుద్దీన్ భార్య సంషినిషా (39), కుమార్తె ఫాతిమా జహీదా (17), కుమారుడు అలీతో కలిసి కొత్తవలస దగ్గర్లోని చింతపాలెంలోని తమ స్థలం వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మొహినుద్దీన్, అతడి భార్య, కుమార్తె మృతి చెందగా, కుమారుడు అలీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో కొత్తవలస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబం మొత్తం బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బావిలోని మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story

