Tue Jan 20 2026 17:59:47 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో మత్తు ఇంజక్షన్ల కలకలం.. ఏడువేల ఇంజక్షన్లు సీజ్
ఈ వ్యవహారంలో మొత్తం 8 మంది పట్టుబడగా.. రెండ్రోజుల్లో ఒకే ప్రాంతంలో మూడు మత్తు ఇంజక్షన్ల కేసులు నమోదయ్యాయి.

విశాఖపట్నంలో మరోసారి మత్తు ఇంజక్షన్ల విక్రయం కలకలం రేపింది. మత్తు ఇంజక్షన్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 8 మంది పట్టుబడగా.. రెండ్రోజుల్లో ఒకే ప్రాంతంలో మూడు మత్తు ఇంజక్షన్ల కేసులు నమోదయ్యాయి. యువతను టార్గెట్ చేస్తూ.. లక్షల్లో ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు.. ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు.. సమయం చూసి 8 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 వేల మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
విశాఖ నుంచి పశ్చిమ బెంగాల్ కు ఇంజక్షన్లను తరలిస్తుండగా.. పోలీసులు దాడి చేశారు. నిందితుల నుంచి ఒక కారు, నగదును స్వాధీనం చేసుకుని, వారి మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. ఇటీవల నగరంలో డ్రగ్స్ వినియోగం పెరగడంతో.. పోలీసులు అనుమానితులపై నిఘా పెట్టారు. విశాఖలో ఈ తరహా మత్తు ఇంజక్షన్లు విచ్చలవిడిగా లభ్యమవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. యువత భవిష్యత్ తో ఆటలాడుతున్న ఇలాంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story

