Fri Dec 05 2025 19:10:05 GMT+0000 (Coordinated Universal Time)
వికారాబాద్ ఘటనలో సురేష్ కోసం గాలింపు
వికారాబాద్ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇందుకు ప్రధాన కారకుడైన సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వికారాబాద్ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇందుకు ప్రధాన కారకుడైన సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సురేష్ కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సురేష్ కాల్డేటానుకూడా పరిశీలిస్తున్నారు. సురేష్ కాల్ డేటాలో మాజీ ఎమ్మెల్యే నెంబరుకు కాల్ చేసినట్లు ఉన్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.
నాలుగు బృందాలు...
అయితే సురేష్ నిన్న జరిగిన గ్రామ సభలో కలెక్టర్ తో పాటు ఇతరఅధికారులను కూడా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించాడని పోలీసులు నమ్ముతున్నారు.ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. సురేష్ పోలీసులకు చిక్కితేనే అసలు ఘటనకు కారణం వెల్లడయ్యే అవకాశాలున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
Next Story

