Fri Dec 05 2025 09:05:31 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రి జైలు కలిపింది నలుగురిని.. స్కూలు.. సిలబస్ ఒక్కేనట
తాళం వేసి ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న నలుగురు నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు

తప్పుచేసి శిక్ష పడి జైలుకు వెళితే అక్కడ వారిలో పశ్చాత్తాపం కలగాలి. అందుకే చట్టాలు నేరాన్ని బట్టి శిక్షలను నిర్ధారించాయి. అయితే జైళ్లు ఇప్పుడు ముఠాలుగా ఏర్పడటానికి కేంద్రాలుగా మారుతున్నాయి. ఒకే నేరం చేసి వచ్చిన నిందితులు గ్యాంగ్ గా ఏర్పడటానికి జైలు ఆవరణ తోడ్పడుతుంది. తాజాగా విజయవాడలో దొరికిన దొంగలను చూసిన తర్వాత ఇదే అర్థమవుతుంది. దొంగతనాలు, దోపిడీల్లో ఆరితేరిన వీరు ఒక ముఠాగా ఏర్పడటానికి రాజమండ్రి కేంద్ర కారాగారం స్థానంగా మారింది. గతంలో అందరూ దొంగతనాలు చేస్తూ దొరికిపోయి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించడానికి వెళ్లారు. అందరూ ఒకే జాతి పక్షులు కావడంతో కెమెస్ట్రీ అక్కడే కుదిరింది.
బయటకు వచ్చిన తర్వాత...
బయటకు వచ్చిన తర్వాత కూడా వారు దొంగతనాలు మానుకోలేదు. తమ దైన శైలిలో వారు దొంగతానాలు చేస్తున్నారు. అయితే పోలీసులకు నేరం జరిగిన విధానాన్ని బట్టి ఎవరు దొంగతానినికి పాల్పడ్డారో ఇట్టే గుర్తిస్తారు. దీనికి తోడు ఇప్పుడు అత్యాధుని పరికరాలు కూడా నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. అందులో భాగంగా బెజవాడలో తాళం వేసి ఉన్న ఇంటిని దోచుకున్న నలుగురు దొంగలను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. వీరి స్కూల్ .. సిలబస్ ఒక్కటే. తాళం వేసి ఉన్న ఇంటిని చూసి కేవలం పది నిమిషాల్లోనే చోరీ వెళ్లిపోతారు. ఇప్పటివరకూ 70కి పైగా దొంగతనాలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కు నెట్టారు.
నలుగురు నిందితులను...
పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంటిని ఎంచుకుంటారు. తాళం పగల కొట్టి నేరుగా ఇంట్లోకి ప్రవేశించి అందినకాడికి దోచుకుని పనిముగించుకుని పదినిమిషాల్లో వెళ్లిపోయే గ్యాంగ్ ఇది. కాకినాడకు చెందిన దేవప్రకాష్, విజయాడకుచెందిన అశోక్ కుమార్, ప్రభుకుమార్, తాడేపల్లికి చెందిన ప్రసన్నకుమార్ లు తిప్పనగుంటకు చెందిన సూరయ్య ఇంట్లో దొంగతానికి పాల్పడ్డారు. ఇంటికి తాళం వేసిఉండగా చూసి పది నిమిషాల్లో యాభై ఏడువేల నగదు, పదహారు గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నాలుగు ప్రాంతాలకు చెందిన వారైనా వీరంతా రాజమండ్రి జైలులో కలిసి ఒక ముఠా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. దొరికిన డబ్బుతో జల్లా చేయడం తిరిగి దొంగతనాలు చేయడం వీరికి అలవాటని పోలీసులు చెబుతున్నారు.
Next Story

