Fri Dec 05 2025 09:36:15 GMT+0000 (Coordinated Universal Time)
కరెన్సీ నోట్ల వర్షం... అవినీతి అధికారి ఇంట్లోనుంచి
ఒడిశా రూరల్ డెవలెప్ మెంట్ లో చీఫ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వైకుంఠనాథ్ సారంగి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు

విజిలెన్స్ అధికారుల దాడులతో ఆ అధికారి బిత్తరపోయాడు. తన ఇంట్లో దాచి ఉంచిన కరెన్సీ నోట్లను కిటికీ నుంచి బయటకు విసిరేశాడు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో ఈ ఘటన జరిగింది. ఒడిశా రూరల్ డెవలెప్ మెంట్ లో చీఫ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వైకుంఠనాథ్ సారంగి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ అధికారులను చూసిన చీఫ్ ఇంజినీర్ వైకుంఠనాథ్ సారంగి వెంటనే తన ఇంట్లో దాడి ఉంచిన కరెన్సీ కట్లను అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ కిటికీ నుంచి బయటకు విసిరేశారు.
చీఫ్ ఇంజినీర్ ఇంట్లో సోదాలు...
అయితే కిటికీ నుంచి కరెన్సీ నోట్లు బయపడటంతో వాటిని ఏరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. కానీ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెంటనే వాటిని రికవరీ చేయగలిగారు. చీఫ్ ఇంజినీర్ ఇంట్లో దాదాపు రెండు కోట్ల రూపాయల నగదును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇరవై ఆరు మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. కరెన్సీ నోట్లతో పాటు మరికొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Next Story

