Thu Mar 19 2026 15:04:57 GMT+0530 (India Standard Time)
ఖైదీలకు ఎస్కార్ట్ చేస్తున్న సమయంలోనూ ఫుల్ గా తాగాడు
చెన్నైకి చెందిన పోలీసు ఖైదీలకు ఎస్కార్ట్ చేస్తున్న సమయంలో

చెన్నైకి చెందిన పోలీసు ఖైదీలకు ఎస్కార్ట్ చేస్తున్న సమయంలో మద్యం సేవించి గొడవకు దిగాడు. ఈ ఘటన అంతా వీడియోలో రికార్డు అయింది. డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ మద్యం తాగి అడ్డంగా దొరికిపోవడంతో అధికారులు అతడిపై యాక్షన్ కు దిగారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులతో సదరు వ్యక్తి వాగ్వాదానికి కూడా దిగాడు.
ఖైదీలను ఎస్కార్ట్ చేస్తున్నప్పుడు మద్యం తాగుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సెయింట్ థామస్ మౌంట్ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగానికి అనుబంధంగా ఉన్న అతడు, పోలీసు వాహనంలో సాదాసీదా దుస్తులలో మద్యం సేవిస్తున్నాడు. పోలీసు డ్రైవర్ పక్కన ఉన్న కప్ హోల్డర్లో మొబైల్ ఫోన్ ను ఉంచి రికార్డ్ చేశారు. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది
Next Story

