Thu Mar 19 2026 18:24:39 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
వాహనం లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది

వాహనం లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. నైనిటాల్ జిల్లాలోని ఓఖల్కండ బ్లాక్ లోని పూదపూరి గ్రామానికి వెళుతున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిరిగింది. ఒక వాహనం రెండు వందల అడుగుల లోయలో పడింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారరు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన...
మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ్ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు పూర్పురి కి చెందిన వారుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

