Wed Jul 09 2025 18:46:27 GMT+0000 (Coordinated Universal Time)
ఉయ్యూరు శ్రీనివాస్ కు ఊరట
ఉయ్యూరు శ్రీనివాస్ కు ఊరట లభించింది. గుంటూరు ఘటనలో అరెస్ట్ అయిన ఆయన రిమాండ్ ను న్యాయమూర్తి తిరస్కరించారు

ఉయ్యూరు శ్రీనివాస్ కు ఊరట లభించింది. గుంటూరు ఘటనలో అరెస్ట్ అయిన ఆయన రిమాండ్ ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో, 304 నుంచి మినహాయింపు లభించింది. 25 వేల రూపాయల పూచికత్తుతో శ్రీనివాస్ ను విడుదల చేయాలని ఆదేశించారు.
విచారణకు...
అయితే పోలీసుల విచారణకు ఉయ్యూరు శ్రీనివాస్ సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. గుంటూరులో అన్నగారి జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఉయ్యూరు ఫౌండేషన్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు
Next Story