Fri Mar 20 2026 10:49:51 GMT+0530 (India Standard Time)
Uttar Pradesh : భయపడిన భర్త...ప్రియుడితో భార్యను పంపించిన వైనం
ఉత్తర ప్రదేశ్‌లో విచిత్రమైన ఘటన జరిగింది

ఉత్తర ప్రదేశ్‌లో విచిత్రమైన ఘటన జరిగింది. ఇటీవల బ్లూ డ్రమ్ భర్తలను భయపెడుతుంది. ప్రియుడితో కలసి కట్టుకున్న వారిని హతమార్చిన ఘటనలను చూసిన వారు తమకు ఈ గతి పడుతుందని భావించి కోరుకున్న ప్రియుడితో భార్యను పంపించి వేస్తున్నారు. ఇలాంటి ఘటన లక్నోలో జరిగింది. మీరట్‌లో జరిగిన “బ్లూ డ్రమ్ హత్య కేసు” తరహాలోనే మరో ఘటన జరగబోతుందనే అనుమానం భర్తలో భయం పుట్టించింది. చివరకు తన ప్రాణాల కోసం భార్యను ఆమె ప్రియుడితోనే పంపించాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...
వివాహేతర సంబంధం...
బులందేశ్వర్‌కు చెందిన రాజ్‌కుమార్ భార్యకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. గతంలో పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి, తన ఆరు నెలల చిన్నారిని భర్త దగ్గర వదిలి, ప్రియుడితో నెలరోజులు గడిపింది. ఈ ఘటనతో అనుమానం పెరిగిన రాజ్‌కుమార్ పలుమార్లు ప్రశ్నించినా, ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది భార్య. ఒకరోజు ఆమె ఫోన్‌ను చెక్ చేసిన రాజ్‌కుమార్‌కు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆమె ఫేస్బుక్ ఖాతాలో నగ్న చిత్రాలతో పాటు “సిమెంట్, డ్రమ్ స్టోరీ” పేరుతో హత్యలకు సంబంధించిన కథనాలు షేర్ చేయడం గమనించాడు. ఈ విషయాలు చూసి తనను కూడా అదే విధంగా హత్య చేసే ప్లాన్ ఉందేమోనని రాజ్‌కుమార్ తీవ్ర భయానికి గురయ్యాడు.
పోలీసులకు చెప్పినా...
తక్షణమే పోలీసులను ఆశ్రయించిన రాజ్‌కుమార్, జరిగిన విషయాన్ని వివరించాడు. పోలీస్ స్టేషన్లో జరిగిన పంచాయతీలో ఆ మహిళ తన భర్తతో ఉండనని, ప్రియుడితోనే వెళ్లాలని స్పష్టం చేసింది. పరిస్థితిని అర్థం చేసుకున్న రాజ్‌కుమార్ చివరకు భార్యను ఆమె ప్రియుడితో పంపించేందుకు అంగీకరించాడు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసుల ప్రభావం ప్రజల్లో ఎంతటి భయాన్ని కలిగించిందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.భార్య, ప్రియుడు కలసి తనను హత మారుస్తారని భావించి ప్రియుుడితో పంపి తన ప్రాణాలను రక్షించుకున్నాడు.
Next Story

