Sat Mar 21 2026 22:19:48 GMT+0530 (India Standard Time)
కారు బీభత్సం .. ఇద్దరు మహిళల మృతి
పెద్దపల్లి పట్టణ శివారు రంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇద్దరు మహిళలు మరణించారు.

పెద్దపల్లి పట్టణ శివారు రంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న ముగ్గురు మహిళలపై కారు దూసుకెళ్లింది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతులు పెద్దపల్లి పట్టణం ఉదయ నగర్ కు చెందిన కుక్క అమృత, కుక్క భాగ్య గా గుర్తించారు.
గాయపడిన వారిని...
తీవ్రంగా గాయపడిన కుక్క పద్మను ప్రభుత్వ ఆసుపత్రి కి స్థానికులు తరలించి చికిత్స అందిస్తుున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.
Next Story

