Fri Dec 05 2025 09:33:46 GMT+0000 (Coordinated Universal Time)
కిలాడీ లేడీలు.. వీరి వలలో పడ్డారంటే ఇక ఆసాంతం ఆస్తులు నాకేసినట్లే
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో ఉంటున్న ఇద్దరు మహిళలు ఒంటరి పురుషులను లక్ష్యంగా చేసుకుని వల వేసి వారి ఆస్తులను కాజేస్తున్న వైనం తెలిసింది

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో ఉంటున్న ఇద్దరు మహిళలు ఒంటరి పురుషులను లక్ష్యంగా చేసుకుని వల వేసి వారి ఆస్తులను కాజేస్తున్న వైనం తెలిసింది. పోలీసులకు కూడా ఫిర్యాదులు అందాయి. కొందరు మాత్రం తాము మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. భార్య చనిపోవడం లేక విడాకులతో వేరుపడి ఉన్న పురుషులను వీరు టార్గెట్ చేస్తారు. ప్రధానంగా ఒంటరిగా ఉన్న వృద్ధులపైనే వీరిద్దరూ వల విసురుతారు. ఆ వలలో పడితే చాలు ఇక డబ్బులు నుంచి నగలు, నట్రా అంటూ గారాలు పోతారు.
ఒంటరిగా ఉన్నామంటూ...
తాము ఒంటరిగా ఉన్నామని పెళ్లి చేసుకునే వారు ముందుకు రావాలని ముందు ప్రకటన ఇస్తారు. ఒక మహిళ ఈ ప్రకటన ఇస్తుంది. తాను కూడా ఒంటరి మహిళనని, వయసుతో సంబంధం లేదని, తనను బాగా చూసుకుంటే చాలు అని గారాలు పోతుంది. భార్య లేని డబ్బులున్న ఒంటరి వృద్ధులే టార్గెట్ చేస్తారు. వీరి మాయమాటలకు పడిపోయి ఎవరైనా ఊ అన్నారంటే చాలు ఉన్నదంతా ఊడ్చేస్తారు. వీరి వలలో పడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకుచెందని దాదాపు 100 మందికి పైగా బాధితులు ఉన్నారని పోలీసులకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.
హైదరాబాద్ కు రప్పించి...
ఆంధ్రప్రదేశ్ కు చెందని మహిళతో పాటు తెలంగాణకు చెందిన మరో మహిళతో కలసి హైదరాబాద్లో ఉంటూ పెళ్లిళ్ల బిజినెస్ మొదలు పెట్టారు. ఇద్దరిలో ఒకరి ఫోటో పెట్టి భర్త లేడని, , బాగా చూసుకుంటే చాలు అని మ్యారేజ్ బ్యూరోలో ప్రకటన ఇచ్చి ట్రాప్ చేస్తారు. నమ్మించి హైదరాబాద్కు రప్పించి బంగారం, చీరలు కొని, అవసరాలకు డబ్బులు, మండపం బోజనాలు అంటూ మరిన్ని డబ్బులు తీసుకుంటారు. తర్వాత ఫోన్ కూడా స్విచాఫ్ చేస్తారు. పెళ్లి పేరు ఎత్తితే చాలు తమను వేధిస్తున్నామంటూ కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతారు. దీంతో మోసపోయిన వారు కూడా మౌనంగా ఉంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో వీరిపై నిఘా పెట్టినట్లు తెలిసింది.
Next Story

