Sat Mar 21 2026 03:09:51 GMT+0530 (India Standard Time)
America : అమెరికాకు ఉన్నత చదువులకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ఉన్నత విద్య అభ్యసించడం కోసం అమెరికాకు వెళ్లి అక్కడ ప్రాణాలు విడిచారు

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ఉన్నత విద్యను అభ్యసించడం కోసం అమెరికాకు వెళ్లి అక్కడ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరిజోనాలోని ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి మరణించారని పోలీసులు తెలిపారు. ఆరిజోనా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేసేందుకు లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి, రోహిత్ మణికంఠ అమెరికా వెళ్లారు.
ఇరవై ఐదు మంది కలసి..
పట్టా పొందిన ఆనందంలో 25 మంది విద్యార్థులు కలసి జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ వీరిద్దరూ మరణించారని చెబుతున్నారు. స్నేహితులు ఇక్కడి బంధువులకు సమాచారం ఇచ్చారు. రాకేశ్ రెడ్డి ఖమ్మం నగరానికి చెందిన యువకుడు అని చెబుతున్నారు. ఈ నెల 8వ తేదీన వీరిద్దరూ మరణించారని తెలిసింది. ఇద్దరి మృతదేహాలను భారత్ కు తీసుకు వచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
Next Story

