Sat Sep 14 2024 11:40:59 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ విషాదం జరిగింది.
తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ విషాదం జరిగింది. గూడూరు మండల కేంద్రంలో కట్టెల లోడ్ తో వస్తున్న లలారీ బోల్తాపడటంతో ఇద్దరు మరణించారు. మహబూబాబాద్ నుంచి వరంగల్ వైపు వెళుతున్న లారీ గూడూరు మండలం కేంద్రం వద్ద బోల్తా పడింది.
బోల్తా పడటంతో...
మలుపు తిరుగుతుండగా ఒక్కసారిగా బోల్తాపడటటంతో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అధిక వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. దీంతో పాటు అధిక లోడు కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story