Sat Sep 14 2024 23:46:18 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కారులో డెడ్ బాడీ..వరద నీటిలో
కోదాడ ప్రాంతంలో వరద నీటిలో రెండు మృతదేహాలు దొరికాయి. రెండు కార్లు కొట్టుకుపోయాయి.
భారీ వర్షాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటికి వెళ్లాలన్న తపనతో వాగులను తమ వాహనాలతో దాటిస్తూ ప్రమాదానికి లోనవుతున్నారు. కొందరు తెలిసీ తెలియక వాహనాలను వాగుల్లో దించుతుండగా, మరికొందరు ధైర్యంతో గమ్యం స్థానం వెళ్లాలని వాగులు దాటుతూ మృత్యువాత పడుతున్నారు. గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు తెలంగాణలో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి.
కోదాడలో...
అయితే కోదాడ ప్రాంతంలో వరద నీటిలో రెండు మృతదేహాలు దొరికాయి. రెండు కార్లు కొట్టుకుపోయాయి. అందులో ఒకరు రవిగా అని గుర్తించారు. మరొకరు ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుగా పోలీసులు తెలిపారు. వరద నీటిలో కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినా మొండి ధైర్యంతో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Next Story