Mon Mar 16 2026 00:50:34 GMT+0530 (India Standard Time)
రుషికొండ వద్ద రెండు మృతదేహాలు
విశాఖ రుషికొండ వద్ద జంట మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో రుషికొండ బీచ్ ప్రాంతంలో కలకలం రేగింది.

విశాఖ రుషికొండ వద్ద జంట మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో రుషికొండ బీచ్ ప్రాంతంలో కలకలం రేగింది. ఒక యువతి, యువకుడు మృతదేహాలు బీచ్ వద్దకు కొట్టుకు రావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ఆత్మహ్యతా? లేక ఇద్దరిని హత్య చేసి సముద్రంలో పడేశారా? అన్న దానిపై స్థానిక పోలీసులు విచారిస్తున్నారు.
ఆత్మహత్యా?
యువకుడి మృతదేహం నిన్న రుషికొండ బీచ్ వద్దకు కొట్టుకువచ్చింది. ఈ మృతదేహాన్ని నంద్యాలకు చెందిన వెంకటరెడ్డిదిగా గుర్తించారు. ఈరోజు తెల్లవారు జామును లభ్యమయిన యువతి మృతదేహం విజయనగరానికి చెందిన దివ్యదిగా పోలీసులు చెబుతున్నారు. వారి బంధువులకు సమాచారం అందించారు. వారి మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు. అది ఆత్మహత్యా? లేదా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

