Tue Sep 10 2024 10:58:14 GMT+0000 (Coordinated Universal Time)
తల్లీ-కూతురు జంట హత్యల కేసులో పురోగతి
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన తల్లీ కూతుళ్ల జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన తల్లీ కూతుళ్ల జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. మృతులు జలదంకి శ్రీదేవి(43), వెంకట లేఖన(21)ల ఒంటిపై ఉన్న సుమారు 20 సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుపోయినట్లుగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా నలుగురు సభ్యుల ముఠాను మహారాష్ట్రలోని షోలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తల్లీ కూతుళ్ల హత్యల కన్నా ముందు నవంబర్ 19వ తేదీన ఇంకొల్లు మండలం పూసపాడు సమీపంలో వృద్ధ దంపతులు కూడా దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఘటనలో దుండగులు వృద్ధురాలి చెవిని కోసి మరీ బంగారు కమ్మలను ఎత్తుకెళ్లినట్లు స్థానిక పోలీసులు గుర్తించారు.
దోపిడీ ముఠా పనేనా?
కాగా.. ఈ నాలుగు హత్యల వెనుక ఉన్న ఒకే ముఠా అని గుర్తించారు. హత్యలు, ఆపై దొంగతనాల అనంతరం దోపిడీ దొంగలు టంగుటూరు టోల్ప్లాజా, ఒంగోలు, అద్దంకి మీదుగా హైదరాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వెంటనే మహారాష్ట్రలోని అధికారులతో సంప్రదింపులు జరిపి అసలు విషయాన్ని చెప్పడంతో.. షోలాపూర్ వద్ద నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని ప్రశ్నించగా.. టంగుటూరు నుంచే వస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం షోలాపూర్ కు బయల్దేరింది.
Next Story